Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADరోడ్డు ప్యాచ్ వర్క్ పనులను వెంటనే పూర్తి చేయాలి

రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను వెంటనే పూర్తి చేయాలి

📰 Generate e-Paper Clip

రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను వెంటనే పూర్తి చేయాలి
– జలమండలి ఈడి ని కోరిన మాజీ కార్పొరేటర్ పావని

హైదరాబాద్,  జూన్ 4, ( అద్దం న్యూస్ ) :   ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ అరుంధతినగర్ బస్తీలోని ప్యాచ్ వర్క్ పనులను వెంటనే పూర్తి చేయాలని మాజీ కార్పొరేటర్ పావని కోరారు. ఈ మేరకు గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ ను, డైరెక్టర్ ఎన్.ప్రభు ను మాజీ కార్పొరేటర్ పావని కలిశారు. అరుంధతినగర్ బస్తీలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సహకారంతో రూ.55 లక్షలతో నిధులతో గతంలో నూతన సివరేజీ పైప్‌లైన్‌ పనులను ప్రారంభించి పూర్తి చేసుకున్నారని పావ‌ని తెలిపారు. పైప్‌లైన్‌ పనులు పూర్తి అయిన చోట ప్యాచ్ వర్క్ పనులు చేయని కారణంగా బస్తిలోని వృద్ధులు, పిల్లలు నడవలేని పరిస్థితి ఏర్పడిందని మాజీ కార్పొరేటర్ పావని వివరించారు. రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు పెండింగ్‌లో ఉందన్నారు. ప్యాచ్ వర్క్ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఉన్నత అధికారులు వారం రోజుల్లో పనులను ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు పావని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి నాయకులు ఎం.ఉమేష్, ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page