హైదరాబాద్, నవంబర్ 20, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ఆరెకటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25న బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆరెకటిక అభివృద్ధి సంఘం అధ్యక్షుడు భూంపల్లి అశోక్ దాదా గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వైన్స్ టెండర్ల కోసం ఉద్యమ సమీక్షతో పాటు ప్రభుత్వం విడిసి విధానం రద్దు చేయాలని, బీసీల 42 శాతం రిజర్వేషన్ కోసం ఉద్యమ పాత్ర, స్థానిక సంస్థలో ఎన్నికల మన పాత్ర, ఇంటిగ్రేటెడ్ మటన్ మార్కెట్లు మనకే ఇవ్వాలి జీవో తేవాలని తదితర అంశాలు, డిమాండ్లపై చర్చించనున్నట్లు తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply