Saturday, September 19, 2026
No menu items!
HomeEducationరైల్వే అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయి!

రైల్వే అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయి!

📰 Generate e-Paper Clip

RRB: రైల్వే అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయి!

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: రైల్వే ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించే ఆన్‌లైన్ రాత పరీక్షల (CBT) షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. ఇటీవల రైల్వే శాఖ భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన పరీక్ష తేదీలను ఇప్పుడు ఖరారు చేసింది.

పరీక్షల షెడ్యూల్ వివరాలు:

అసిస్టెంట్ లోకో పైలట్ (ALP): 9,970 పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు ఫిబ్రవరి 16, 17, 18 తేదీల్లో జరగనున్నాయి.
టెక్నీషియన్: 6,238 పోస్టులకు (గ్రేడ్ 1 సిగ్నల్ & గ్రేడ్ 3) రాత పరీక్షలను మార్చి 5 నుండి 9 వరకు నిర్వహిస్తారు.
జూనియర్ ఇంజనీర్ (JE): 2,569 పోస్టులకు గాను ఫిబ్రవరి 19, 20 మరియు మార్చి 3 తేదీల్లో పరీక్షలు ఉంటాయి.
పారామెడికల్: 434 పోస్టులకు మార్చి 10 నుండి 12 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ముఖ్య సూచనలు:
అభ్యర్థులు పరీక్ష తేదీకి 10 రోజుల ముందు తమ ఎగ్జామ్ సిటీ (City Intimation Slip) వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే పరీక్షకు సరిగ్గా 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులను (Admit Cards) అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని రైల్వే బోర్డు (RRB) తెలిపింది. అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను ఈ షెడ్యూల్ ప్రకారం కొనసాగించాలని అధికారులు సూచించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page