Saturday, September 19, 2026
No menu items!
HomecinemaOscar: కాంతార-1, మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌ మరో ముందడుగు

Oscar: కాంతార-1, మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌ మరో ముందడుగు

📰 Generate e-Paper Clip

Oscar: కాంతార-1, మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌ మరో ముందడుగు

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) మరోసారి అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది. వారు నిర్మించిన రెండు ప్రతిష్ఠాత్మక చిత్రాలు ‘కాంతార చాప్టర్ 1’, ‘మహావతార్ నరసింహ’ 98వ ఆస్కార్ (Oscar) అవార్డుల (Oscars 2026) రేసులో జనరల్ ఎంట్రీ విభాగంలో చోటు దక్కించుకున్నాయి.

‘మహావతార్ నరసింహ’ ప్రత్యేకత

ఇది భారతదేశం నుండి Best Animated Feature Film విభాగంలో పోటీ పడుతున్న అత్యంత శక్తివంతమైన చిత్రం. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఇండియాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన యానిమేషన్ చిత్రంగా రికార్డు సృష్టించింది. హాలీవుడ్ చిత్రాలైన ‘జూటోపియా 2’, ‘ఎలియో’ వంటి చిత్రాలతో ఇది పోటీ పడుతుండటం విశేషం.

‘కాంతార చాప్టర్ 1’ ప్రభంజనం

రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం, తన సాంస్కృతిక, ఆధ్యాత్మిక నేపథ్యంతో అంతర్జాతీయ జ్యూరీని ఆకట్టుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ ఒకేసారి రెండు చిత్రాలను ఆస్కార్ బరిలో నిలపడం భారతీయ సినిమా గర్వించదగ్గ విషయం.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page