అద్దం న్యూస్, వెబ్డెస్క్: నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వివిధ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి (RTC Jobs) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 198 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 84 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (TST), 114 మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (MST) పోస్టులు ఉన్నాయి.
అర్హతలు:
అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి (జులై 1, 2025 నాటికి). ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఎక్స్-సర్వీస్మెన్లకు 3 ఏళ్ల వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం:
ఆసక్తిగల (RTC Jobs) అభ్యర్థులు 2026 జనవరి 20 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.800 కాగా, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.400గా నిర్ణయించారు. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.27,080 నుండి రూ.81,400 వరకు వేతనం లభిస్తుంది.












Leave a Reply