హైదరాబాద్, నవంబర్ 17, అద్దం న్యూస్ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత ఎన్‌టిఆర్ అభిమాని కల్యాణపు ఆగయ్య మృతి చెందడం బాధాకరమని ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా అన్నారు. సోమవారం హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో ఆగయ్య మృతి పట్ల సంతాపాన్ని తెలియచేశారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి స్వర్గీయ నందమూరి తారక రామారావుకి కరుడుగట్టిన వీర అభిమానిగా పేరు గాంచిన కల్యాణపు ఆగయ్య గుండెపోటుతో మరణించారన్నారు. ఆయన మృతి యావత్ ఎన్టీఆర్ అభిమాన లోకానికే కాకుండా తెలుగుదేశం పార్టీకి కూడా తీరని లోటు అని సాయిబాబా అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రకాష్ సంతాపాన్ని ప్రకటించారు. ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర నల్లెల్లకిషోర్, బాలరాజు గౌడ్, ఎస్.ప్రకాష్, భానుప్రకాష్, కిరణ్, కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply