...

డబుల్ బెడ్ రూం నివాసాల‌లోని వాణిజ్య షాపుల అమ్మకాలను వెన‌క్కి తీసుకోవాలి – సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

డబుల్ బెడ్ రూమ్ వాసులను ముంచాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
డబుల్ బెడ్ రూం నివాసాల‌లోని వాణిజ్య షాపుల అమ్మకాలను వెన‌క్కి తీసుకోవాలి
– సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

హైదరాబాద్, మార్చి 26, అద్దం న్యూస్ :   డబుల్ బెడ్ రూమ్ వాసులను కాంగ్రెస్ ప్రభుత్వం ముంచాలని చూస్తొంద‌ని, డబుల్ బెడ్ రూమ్‌ నివాసాల‌లోని వాణిజ్య షాపుల అమ్మకాలను వెన్నక్కి తీసుకోవాలని సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ప్రజలపై భారం పడే, ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని వేలం విక్రయాలను వెంటనే ఆపాలని సిపిఎం ఆధ్వ‌ర్యంలో గురువారం హైద‌రాబాద్ ఇందిరాపార్క్ ధ‌ర్నాచౌక్‌లో ధ‌ర్నా జ‌రిగింది. ఈ ధ‌ర్నాకు ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్‌వెస్లీ హాజ‌రై మాట్లాడుతూ… గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేదలకోసం నిర్మించిన డబుల్ బెడ్ రూం సముదాయాల్లో లిఫ్ట్లు, ఇతర మెయింటెనెన్స్ కోసం ప్రజలపై భారం పడకుండా గత ప్రభుత్వం నిర్మించిన షాప్‌ల‌ను వేలం ద్వారా విక్రయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నిర్మించిన 16 డబుల్ బెడ్ రూమ్‌ కాలనీల్లోని 992 వాణిజ్య సముదాయాలను వేలం పద్ధతిలో విక్రయించడానికి మార్చి నెలాఖరు వరకు తగు ఏర్పాట్లు చేయాలని, 2026 మార్చి 17న జిల్లా అడిషనల్ కలెక్టర్ చేసిన ప్ర‌క‌ట‌న‌ను, ఈ విక్రయాలను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.

షాపులను కిరాయిలకు ఇస్తే కిరాయిలు సరిగా చెల్లించకపోతే సమస్యలు వస్తాయని ప్రభుత్వం అంటుందన్నారు. ఇది అర్ధంలేని వాదన. షాపులను వేలం ద్వారా కిరాయికి ఇవ్వాలని, రెండు లేదా 3 సంవ‌త్స‌రాల‌కు ఒకసారి వేలం వ్యవధిని నిర్ణయించాలన్నారు. డిపాజిట్‌ల‌ను ఇతర పనులకు కాజేస్తే ప్రతి నెలా లిఫ్ట్, ఇతర మెయింటినెన్స్ భారాలు ప్రజలపై పడతాయన్నారు. పేద ప్రజలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని విమ‌ర్శించారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.

సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ… వాణిజ్య సముదాయాలు అమ్మగా వచ్చిన డబ్బును డబుల్ బెడ్ రూం వాసుల అభివృద్ధికే ఖర్చు చేస్తామని ప్రభుత్వం అంటుంది కానీ ఇక్కడే మతలబు ఉందన్నారు. వేలం విక్రయాల ద్వారా వచ్చిన డబ్బు డబుల్ బెడ్రూం వాసుల కోసమే ఖర్చుపెడతామని చెప్పి వేరే చోట అసంపూర్ణంగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణానికి తరలిస్తారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. అందుకని ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల మరమ్మత్తులకు, అభివృద్ధి పనులకు, అసంపూర్ణంగా ఉన్న పనులు పూర్తి చేయడానికి బడ్జెట్ కేటాయించి ఖర్చు చేయాలని సిపిఎం పార్టీ చేస్తున్న డిమాండ్ సరైనదేనాని అన్నారు. సీపీఎం పార్టీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి.సత్యం మాట్లాడుతూ…మేడ్చల్ జిల్లాలో డబుల్ బెడ్ రూంలను అమ్మకాలను నిర్వహిస్తున్నామని, అప్పటి నుండే ఎర్ర జెండా సీపీఎం పార్టీ బాధితులకు మద్దతుగా కలెక్టర్ ఆఫీస్ ముందు భారీ ధర్నా నిర్వహించం జ‌రిగింద‌న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.రవి, ఏ.అశోక్, ఎం.వినోద, జి.శ్రీనివాస్, ఐ.రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు ఎం.నరేష్, బి.లింగ స్వామి, ఎన్.శ్రీనివాస్, జె.వెంకన్న, ఎన్.సబితా, గణేష్, బి.నర్సింగ్ రావు, శ్రీనివాస్ రావు, విజయ్, రవీందర్, బాబు రావు, అనిల్, రమాదేవి, నర్సింహా, రాజేందర్, దివ్య, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.