వివేక్‌నగర్‌లో ఘనంగా సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి

హైదరాబాద్, ఆగస్టు 17, అద్దం న్యూస్ : బహుజన నాయకుడు సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి కార్యక్రమం హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్‌నగర్‌లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి బంటారం యాదగిరి గౌడ్ హాజరై పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీనర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన భారతదేశపు తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ విసునూరు నుంచి గోల్కొండ కోటపై దాడి చేసి స్వాధీనం చేసుకున్నారన్నారు. నాటి పాలకుల నిరంకుశపాలనపై యుద్ధం చేసిన యోధుడు.. రాచరికపు దోపిడీని వ్యతిరేకించిన ధీశాలి పాపన్న గౌడ్ అని పేర్కొన్నారు. నగరంలో కల్లును నిషేధించడం, కల్లు దుకాణాలను మూసివేయించడం మంచిది కాదని, గౌడ్‌లందరూ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారన్నారు. ఎవరో ఒకరు కల్తీ కల్లును విక్రయిస్తే అందరికి శిక్ష వేయడం సబబుకాదన్నారు. కల్తీ చేసిన వారిని శిక్షించండి కానీ గౌడ్‌లందరి కడుపుకొట్టడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి కల్లు దుకాణాలను పునరుద్దరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శంకర్ గౌడ్, జహంగీర్ గౌడ్, నవీన్ గౌడ్, చెన్నయ్య, సుబ్బారావు, చిన్న, వెంకటేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply