నెహ్రూ బాల భవన్ ను సంర‌క్షించండి

హైదరాబాద్, జూన్ 22, అద్దం న్యూస్ :    వివిధ రంగాల్లో బాలల సృజనలో పరుగులు తీయించాల్సిన బాల భవన్ లు అధ్యాపకుల కొరతతో అధ్వాన్న స్థితిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రం టిపిఎస్‌కెలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… జవహర్ లాల్ నెహ్రూ స్వయంగా స్థాపించిన బాల భవన్ 1966 జూన్ 23న పబ్లిక్ గార్డెన్ లోని జవహర్ బాల భవన్ ప్రారంభించి నేటికీ 60 సంవత్సరాలు అయినా సందర్భంగా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్వయంగా తెలంగాణలో 10 బాల భవన్ లు 9 బాల కేంద్రాలున్నాయని అన్నారు. భారత దేశంలోనే హైదరాబాద్‌ పబ్లిక్ గార్డెన్‌లో ఉన్న జవహర్ బాల భవన్ కు 60 సంవత్సరాలు దిన దినము వర్తమాన చెందాల్సిన బాల కేంద్రాలు కొద్ది మందికి అడ్డాగా మారి, అభివృద్ధికి అడ్డంకిగా ఉన్నారన్నారు. పిల్లల భవిష్యత్తును ఫణంగా పెట్టి, పని లేకుండా జీతాలు తీసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని.. డిప్యూటేషన్ నుండి వచ్చి బాల భవన్ లో తిష్ట వేసి ఏ విధమైన పనులు చేయకుండా కాలయాపన చేస్తున్నారని.. వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

జవహర్ బాలభవన్ లు ఎందుకిలా మారింది ? అసలు ఏం జరుగుతుంది ? విద్యా శాఖకు కనీస పట్టిం పైన ఉందా..? అని ప్రశ్నించారు. మోడీ నడుపుతున్న నేషనల్ బాల భవన్ లు కూడా అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న చందంగా తయారైందన్నారు. పిల్లలు మహిళలు పౌష్టికాహార లేమి వల్ల 50 శాతం అవస్తలు పడుతుంటే యోగా ఒక్కటే సర్వరోగ నివారిణి అంటున్నారని అన్నారు. జానపద వృత్తి కళాకారుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మురళీధర్ దేశ్‌పాండే మాట్లాడుతూ… ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం అందుబాటులోకి లేక పోవడానికి కారణాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం నాయకులు పొన్నం రాజయ్య, మహేష్ దుర్గే, జీవన్, ఆనంద్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page