హైదరాబాద్, అద్దం న్యూస్ : ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం కేటాయించిన నిధుల ఖర్చుల పై ఎస్సీ, ఎస్టీ శాసన సభ్యులు అసెంబ్లీలో చర్చించాలని గద్దర్ పౌండెషన్ వ్వవస్ధాపక కార్యదర్శి గుమ్మడి సూర్యకిరణ్ అన్నారు. దళిత బహుజన ఫ్రంట్ అధ్వర్యంలో శనివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన అధ్యక్షతన ఎస్సీ, ఎస్ఠి ప్రత్యేక అభివృద్ధి నిధుల పై శ్వేత పత్రం ప్రకటించాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గద్దర్ పౌండేషన్ వ్వవస్ధాపక కార్యదర్శి గుమ్మడి సూర్యకిరణ్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయకపొవడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అన్నారు. బడ్జెట్‌ను విద్య, వైద్య రంగాలకు చేవెళ్ల డిక్లరేషన్‌ను అమలు చేయాలన్నారు.
.డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ… అంబేద్కర్ ఆభయ హస్తం పధకాన్ని ప్రవేశపెట్టాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్‌ను విడుదల చేయాలని, ఎస్సీ, ఎస్ఢి ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం కింద కేటాయించిన నిధుల ఖర్చు పై శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా బిఅర్ఎస్ ప్రభుత్వం అమలు చెసిన దళిత బంధు పధకం స్థానంలో అంబేద్కర్ ఆభయ హస్తం పేరుతో ప్రతి కుటుంబానికి 12 లక్షల ఆర్ధిక సహయాన్ని అందజెస్తామనె హమి నేటికి కార్యరూపం దాల్చలేదన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు చైర్మన్‌ను నియమించినప్పటికి కొత్త యాక్షన్ ప్లాన్ విడుదల చేయడం లేదన్నారు. గతంలోని పెండింగ్ సబ్సిడీలను విడుదల చేయడంలేన్నారు. 2024-25 బడ్జెట్‌లో ఎస్సీ ప్రత్యేక అభివృధ్ది నిధి కింద 33,127 వేల కోట్లను కేటాయించగా కేవలం 9,824 కోట్లను మాత్రమే ఖర్చు చేశారన్నారు. ఖర్చు 29.7 శాతం మాత్రమేనన్నారు. దాదాపు పది శాఖలు ఒక్క రూపాయి కూడ ఖర్చు చెసిన పాపానికి పొలేదన్నారు. ఆర్ధిక సంవత్సరం ముగిసి మళ్ళి బడ్జెట్ వస్తున్నప్పటికి ఇంకా 23,303 కోట్లను ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.
గిరిజన శక్తి వ్వవస్ధాపక అధ్యక్షుడు వెంకటేష్ చౌహన్ మాట్లాడుతూ… ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద 17,056 వేల కోట్లు కేటాయించగా కేవలం 6,766 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ మాట్లాడుతూ.. చట్టం ప్రకారం నిధుల ఖర్చుపై సొషల్ అడిట్ నిర్వహించి నిధుల ఖర్చులో జవాబుదారి తనాన్ని పెంపొందించాలన్నారు. తద్వారా ఎస్సి, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి పధకాలను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చెశారు. పీపుల్స్ మానిటరింగ్ కన్వీనర్ ఎస్.శివలింగం మాట్లాడుతూ… నిధుల ఖర్చు కాకపొవడంతో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి పై నీలి నీడలు కమ్ముకున్నాయన్నారు. తెలంగాణా వ్వవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ… ఆహర, సామాజిక భద్రత కరువైందన్నారు. కనీసం రెషన్ కార్డుల జారీ, పెన్షన్ల మంజూరు ప్రకటనలకే పరిమితమౌతుందన్నారు. కెవిపియస్ రాష్ట్ర నాయకులు దశరధ్ మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వివక్ష పాటిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త మామిడి నారయణ,సైంటిపిక్ స్టూడెంట్స్ యూనియన్ కార్యదర్శి డి.మోహన్, డిబిఎఫ్ నాయకులు చుంచు రాజేందర్, దాసరి ఎగొండ స్వామి, బ్యాగరి వేణు, పులి నవిన్ కుమార్, పరమేశ్వరి, రమ, ఉమ, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply