హైదరాబాద్, జూన్ 16, అద్దం న్యూస్ : వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి 102 ఎ రీజియన్-4 రీజన్ ఛైర్మన్ జయప్రకాష్ రామ్ కొత్తూరు ఆధ్వర్యంలో డాన్ టు డస్క్ కార్యక్రమం సోమవారం ముషీరాబాద్‌లోని సరస్వతి దేవీ దేవాలయంలో తొమ్మిది క్లబ్స్ సంయుక్తంగా సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విసిఐ ఉపాధ్యక్షుడు విఎం.గార్లపాటి సంతోష్, గౌరవ అతిథిగా సుజాత రావు తన్నీరు, రీజియన్ ఛైర్మన్ జయప్రకాష్ రామ్ కొత్తూర్, విఎం.బాదం కళా కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వాసవి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో యోగా, మెడికల్ క్యాంప్‌లను నిర్వహించారు. ఈ శిబిరానికి సుమారు 900 మంద హాజరై ఉచితంగా కంటి పరీక్షలు, షుగర్ పరీక్షలను చేయించుకున్నారు. అలాగే నాలుగు దేవాలయాలకు వెయ్యి లీటర్ల మంచినీటి ట్యాంక్‌లను అందచేశారు. మానసిక దివ్యాంగులను ప్రారంభ దశలోనే గుర్తించే కిట్స్‌ను డొనేట్ చేయడం జరిగింది. అలాగే చెప్పులు కుట్టే వారికి సంబంధించిన పని ముట్లను అందచేశారు. అనంతరం రైతులకు, సైనికులకు సన్మానం చేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply