మ్యారేజ్ బ్యూరోల సేవలు సమాజానికి ఆదర్శం
– మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య
హైదరాబాద్, జూలై 14, ( అద్దం న్యూస్ ) : మ్యారేజ్ బ్యూరోల సేవలు సమాజానికి ఆదర్శమని తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. జై తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ పాముల రమణ అధ్యక్షతన జన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి నంది అవార్డులు, జాతీయ డాక్టర్.బిఆర్.అంబేద్కర్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మంగళారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నంది అవార్డులను, జాతీయ డాక్టర్.బిఆర్.అంబేద్కర్ అవార్డులను అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… మ్యారేజ్ బ్యూరోలు సామాజిక బాధ్యతతో పనిచేస్తూ కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. సమాజానికి సేవ చేస్తున్న వారి కృషిని గుర్తించడం అభినందనీయమని అన్నారు. వివాహానంతరం కుటుంబాలు సంతోషంగా ఉండేలా మార్గనిర్దేశం చేయడం కూడా మ్యారేజ్ బ్యూరోల బాధ్యతేనని చెప్పారు.
డాక్టర్.బిఆర్.అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సేవలు అందించాలని సూచించారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. పెళ్లి ఇద్దరు వ్యక్తులను మాత్రమే కాకుండా రెండు కుటుంబాలను కలిపే పవిత్ర బంధమని రాజయ్య పేర్కొన్నారు. వేలాది కుటుంబాలకు సంబంధాలు కుదిర్చి సమాజానికి సేవ చేస్తున్న మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులను నంది అవార్డులతో సత్కరించడం అభినందనీయమన్నారు. అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ పాముల రమణ మాట్లాడుతూ… మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ( రాజన్న ) వంటి నాయకుల ప్రోత్సాహం తమ సంస్థకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. ఇలాంటి సహకారం కొనసాగితే వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మరెంతో మందిని గుర్తించి అవార్డులతో సత్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అతిథులు, అవార్డు గ్రహీతలు, మీడియా ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కరిస్ట్ జేబి రాజు, రాష్ట్ర మహిళా చైర్మన్ భారతీదేవి, నూతి చంద్రమౌళి, రాజలింగు, జై భీమ్ టివి ఛైర్మన్ శివ, క్రాంతి కుమార్, పాముల అశోక్, శ్రీకాంత్, హరీష్, స్వప్న భరత్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply