ఫిన్లాండ్‌లో అదృశ్యమైన మనీదీప్ రెడ్డి తల్లిదండ్రులను
పరామర్శించిన బండారు దత్తాత్రేయ
వనస్థలిపురం, జూలై 13, ( అద్దం న్యూస్ ) : ఫిన్లాండ్‌లో 2026 మే 6వ తేదీ నుంచి అదృశ్యమైన బి.టెక్ విద్యార్థి గుజ్జా మనీదీప్ రెడ్డి తల్లిదండ్రులు ముత్యం రెడ్డి, మమతా రెడ్డిని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సోమవారం హైదరాబాద్‌లోని వనస్థలిపురం వైదేహినగర్ కాలనీలోని వారి నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన తాజా పరిణామాల గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.మనీదీప్‌ను గుర్తించి క్షేమంగా స్వదేశానికి తీసుకురావడానికి సంబంధిత అధికారుల ద్వారా సాధ్యమైన అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వారికి భరోసా కల్పించారు. ఈ సంఘటన పట్ల తన ప్రగాఢ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి, సంఘీభావాన్ని తెలియజేస్తూ, ఈ వ్యవహారం పరిష్కారమయ్యే వరకు వారికి తన సంపూర్ణ సహకారం, మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని దత్తాత్రేయ హామీ ఇచ్చారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply