అప్స, భారత్ సేవాశ్రం లాంటి స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయం
– సరూర్‌నగర్ కార్పొరేటర్ శ్రీవాణి

సరూర్‌నగర్, ఆగస్టు 05, అద్దం న్యూస్ : అప్స, భారత్ సేవాశ్రం లాంటి స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయమని సరూర్‌నగర్ కార్పొరేటర్ శ్రీవాణి అంజన్ కుమార్ అన్నారు. అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో భారత్ సేవాశ్రం సహకారంతో సరూర్‌నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అక్కడి స్థానిక కార్పొరేటర్ శ్రీవాణి అంజన్ కుమార్ హాజరై విద్యార్థినీ, విద్యార్థులకు నోటు పుస్తకాలను అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అప్స, భారత్ సేవాశ్రం లాంటి స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు ప్రతి ఒక్కరూ విద్యార్థి దశనుండి సేవ గుణాన్ని అలవర్చుకోవాలని, చదువు చెప్పిన గురువులను తల్లీ దండ్రులను గౌరవించి తాము చదువుకున్న పాఠశాలకు మంచి పేరు తేవాలని, అప్ప సామాజిక కార్యకర్త బొట్టు రమేష్ తాను చదువుకున్న పాఠశాలకు తాను సహాయం చేయాలని, 4000 వ్రాత పుస్తకాలు దాతల ద్వారా అందించడం అభినందనీయమన్నారు. అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల ఉమాదేవి మాట్లాడుతూ… బొట్టు రమేష్ ఈ పాఠశాలలో చదివి తాను చదువుకున్న పాఠశాలలో ఇలాంటి సేవ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. పుట్టిన ఊరు చదువు చెప్పిన గురువులను ఎప్పుడూ మరువరాదన్నారు. అనంతరం అప్స స్వచ్ఛంద సంస్థ సీనియర్ కో–ఆర్డినేటర్ బొట్టు రమేష్ మాట్లాడుతూ… అప్స స్వచ్ఛంద సంస్థ వివిధ దాతల ద్వార పేద ప్రజలు సహాయం చేయడం కాకుండా హైదరాబాద్‌లో ఉచితంగా నైపుణ్యత శిక్షణ ఇవ్వడమే కాకుండా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. నేను పేదలకు సహాయం చేస్తున్న అంటే ఇక్కడ చదువు చెప్పిన గురువుల దీవనలే అని అన్నారు. పాఠశాల ఛైర్మన్ వసంత, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ… స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply