చలివేంద్రం కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయం
– గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి
హైదరాబాద్, అద్దం న్యూస్ : చలివేంద్రం కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. ఆదివారం శ్రీ సత్య సాయి సేవా సంస్థ, తార్నాక సమితి ఆధ్వర్యంలో తార్నాక బస్ స్టాప్ వద్ద మజ్జిగ, చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్, టిటియుసి రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డిలు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రం మజ్జిగ, మంచినీటిని ప్రజలకు అందజేశారు. ఈ సందర్బంగా మోతే శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ.. వేసవి కాలంలో పెరిగే ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా చలివేంద్రం కేంద్రాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మంచి మార్పులను తీసుకువస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి సేవా సంస్థ సభ్యులు, స్థానికులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. 













Leave a Reply