Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadఅంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు

అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

 

అంబ‌ర్‌పేట్‌, అద్దం న్యూస్ :   శ్రీరామనవమి సందర్బంగా అంబ‌ర్‌పేట్ ర‌ఘునాథ్‌న‌గ‌ర్‌లో అంబర్ పేట్ శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యానోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ అంబ‌ర్‌పేట్ డివిజన్ అధ్యక్షులు సిద్ధార్ధ ముదిరాజ్ పాల్గొని సీతరాముల వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజలందరికి శ్రీ రామనవ‌మి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సంజయ్ ముదిరాజ్, నరేంద్ర ముదిరాజ్, బొట్టు మహేష్ గౌడ్, సురేష్ ముదిరాజ్, కాశి రెడ్డి, గణేష్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

సీతారాముల కల్యాణోత్సవం వేడుకలో పాల్గొన్న విహెచ్ :

అంబ‌ర్‌పేట్‌లో జ‌రిగిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వేడుకలలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు, అంబ‌ర్‌పేట్‌ నియోజకవర్గ ఇన్చార్జ్, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రోహిన్ రెడ్డి, టిపిసిసి సెక్రటరీ శంబుల శ్రీకాంత్ గౌడ్, రామ్మోహన్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page