ఈ నెల 29న శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ
హైదరాబాద్, డిసెంబర్ 26, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లో ఈ నెల 29వ తేదీన స్థానిక కార్పొరేటర్ ఎ.పావని ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజకు సంబంధించి కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ మాట్లాడుతూ… ఈ నెల 29వ తేదీన కార్పొరేటర్ పావని ఆధ్వర్యంలో శ్రీనివాస గ్రౌండ్స్‌లో అయ్యప్ప స్వామి మహాపడి పూజకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, రాజు, పి.నర్సింగ్ రావు, సత్తి రెడ్డి, ప్రకాష్ యాదవ్, సాయికుమార్, సంయుక్తా రాణి తదితరులు పాల్గొన్నారు.















Leave a Reply