భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీరామ నవమి
హైదరాబాద్, మార్చి 27, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్ డివిజన్ దేవుని తోటలోని శ్రీ భవాని శంకర దేవాలయంలో శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం కనుల విందుగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలో గ్లోబల్ హ్యూమనిటెరియన్ బత్తిని అలకనందన, ఏఐడి ఫౌండేషన్, యశోద హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిబిరాన్ని ప్రారంభించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో జ్యోతి, ఆలయ కమిటీ చైర్మన్ సురేష్, మాజీ చైర్మన్ శ్రీనివాస్, కమిటీ సభ్యులు రాజు, ఆలయ సిబ్బంది మిక్కిలినేని సురేష్, ప్రభాకర్, భక్తులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply