శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం హుండీ లెక్కింపు
112 రోజుల్లో రూ.27 లక్షల 16 వేల 701 హుండీ ఆదాయం
హుండీలో 147 యుఎస్ డాలర్లు, 100 సింగపూర్ డాలర్లు

హైదరాబాద్, జులై 16, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగరం ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లిలో ప్రసిద్ది చెందిన శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం జరిగింది. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు జి.శ్రీనాథ్‌గౌడ్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈవో అన్నపూర్ణ, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ సురేఖ ల పర్యవేక్షణలో మార్చి 27 నుంచి బుధవారం వరకు 112 రోజులకుగాను హుండీ లెక్కించారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమానికి స్థానిక భక్తులు హాజరై లెక్కించారు. 112 రోజులకుగాను 27 లక్షల 16 వేల 701 రూపాయల ఆదాయం వచ్చింది. దాంతో పాటు 147 యుఎస్ డాలర్లు, 100 సింగపూర్ డాలర్లు హుండీలో ఉన్నాయని ఈవో అన్నపూర్ణ తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply