ఫూలే దంపతుల విగ్రహాలను ట్యాంక్‌బండ్ పై ఏర్పాటు చేయాలి – బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం

 

హైదరాబాద్, అద్దం న్యూస్  మహిళలకు సమానత్వం మూఢ నమ్మకాలపై వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తులు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అని అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర భావితరాలకు అందించడానికి పూలే దంపతుల విగ్రహాలను ట్యాంక్‌బండ్ పై ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘ జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. గుజ్జ సత్యం అధ్యక్షతన బుధవారం హైదరాబాద్‌లో కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే మొట్ట మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే దంపతులు విగ్రహాలను నగరంలో ఏర్పాటు చేయాలని కోరారు. ట్యాంక్‌బండ్ పై మహాత్మా జ్యోతిబాపూలే దంపతుల 150 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురువుగా భావించే జ్యోతిరావుపూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించడం ఏంటని ప్రశ్నించారు. దేశంలో విద్యా విప్లవం తీసుకువచ్చిన గొప్ప సంఘ సేవకులు పూలే దంపతులను కొనియాడారు. ఏప్రిల్ 11న పూలే జయంతి వేడుకల్లో విగ్రహ ఏర్పాటు పై ప్రకటన చేయాలనిలేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు నీలం వెంకటేష్, జిల్లాపెల్లి అంజి, జెల్ల నరేందర్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page