...

దసరా సెలవుల్లో విద్యా సంస్థలను నడపకుండా చర్యలు తీసుకోవాలి – ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె.అశోక్ రెడ్డి

దసరా సెలవుల్లో విద్యా సంస్థలను నడపకుండా చర్యలు తీసుకోవాలి

– ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె.అశోక్ రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 20, అద్దం న్యూస్ :    దసరా సెలవుల్లో విద్యా సంస్థలను నడపకుండా చర్యలు తీసుకోవాలని, విద్యా సంస్థలను నడిపితే ప్రతక్ష్య ఆందోళనలు చేపడతామ‌ని ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె.అశోక్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఆదివారం ఆయ‌న మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చినా కూడా కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు గుట్టుచ‌ప్పుడు కాకుండా సంస్థ‌ల‌ను నడుపుతున్నారని అన్నారు. విద్యా సంస్థలు నడపకుండా చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖాధికారులు విద్యా సంస్థలకు దాసోహం అవుతూ తాయిలాలు తీసుకుని చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యా సంస్థలను నడిపకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దసరా సెలవుల్లో విద్యా సంస్థలు నడిపితే విద్యా సంస్థల ముందు ప్రతక్ష్య ఆందోళనలు నిర్వహిస్తామని అశోక్‌రెడ్డి హెచ్చ‌రించారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.