...

బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్డ్‌లో పెట్టేంత వరకు పోరాటం ఆగ‌దు – మ‌హాధ‌ర్నాలో వ‌క్త‌లు

బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్డ్‌లో పెట్టేంత వరకు పోరాటం ఆగ‌దు

–  మ‌హాధ‌ర్నాలో వ‌క్త‌లు

హైదరాబాద్, అక్టోబ‌ర్ 24, అద్దం న్యూస్ :      బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టేంత వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ప‌లువురు వ‌క్త‌లు స్ప‌ష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే 9వ షెడ్యూల్డ్‌లో పెట్టాల‌ని డిమాండ్ చేస్తూ 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం హైద‌రాబాద్‌ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద బీసీల మహాధర్నా జరిగింది. బిసి జాతీయ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు టి.చిరంజీవులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్ ల సంయుక్తాధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ ధర్నాకు బీపీ మండల్ మనమడు సూరజ్ మండల్, హరిచంద్రమండల్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, మధు యాష్కీ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు మసుదనా చారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, సిపిఐ నుండి ఎమ్మెల్సీ నెల్లికంట్టి సత్యం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, బీఎస్పీ రాష్ట్ర నాయకులు ఇబ్రహీం శేఖర్, 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యుడు, 42 బీసీ రిజర్వేషన్ సాధన సమితి, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ లు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ… స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే 9వ షెడ్యూల్డ్ లో తప్పనిసరిగా చేర్చాల్సిందేనని స్పష్టం చేశారు. బీసీలకు రాజ్యాధికారం ద్వారానే అన్ని రంగాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. కోర్టులలో బీసీలకు సమన్యాయం జరగడంలేదని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో బీసీలకు 69 శాతం రిజర్వేషన్లు అమలు జరిగాయని.. అదే తరహాలో పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బీసీలను అడుగడుగునా మోసం చేస్తుందని అన్నారు. కుల గణన తప్పుల తడకగా నిర్వహించి డెడికేషన్ కమిటీ పేరుతో చేతులు దులుపుకున్నారే తప్ప కులగలను ద్వారా బీసీలకు జరిగిన న్యాయం ఏమీ లేదన్నారు. గవర్నర్ ఆమోదం లేకుండా కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేయడం సరైంది కాదన్నారు. పార్టీల పరంగా అవసరం లేదన్నారు. గత 76 సంవత్సరాలుగా బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగానే మార్చుకున్నారని ఆయన మండిపడ్డారు.

కాంగ్రెస్, బిజెపి నాయకులు బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టేంత వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మేమెంతో మాకు అంత వాటా నినాదంతో బీసీలు ముందుకు సాగాలని జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ… బీసీలను పాలకవర్గాలు బిచ్చగాళ్లుగా చూస్తున్నరని బీసీలకు రాజ్యాధికారంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. సంపదను అగ్రవర్ణాలు కబంధ హస్తాల్లో పెట్టుకుంటున్నారని అన్నారు. బీసీల రిజర్వేషన్ల సాధన 9వ షెడ్యూల్ ద్వారానే సాధ్యమన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ…. విద్యా ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ద్వారానే న్యాయం జరుగుతుందన్నారు. బీసీల రిజర్వేషన్లను అగ్రవర్ణాలు నోటి గాడి ముద్దులు లాక్కున్నారని మండిపడ్డారని అన్నారు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతుందన్నారు. బీసీలు చేసే రిజర్వేషన్ల న్యాయపోరాటానికి సిపిఎం సంపూర్ణ మద్దతిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి బీసీ రిజర్వేషన్లు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… బీసీల సంక్షేమం కోసం 42 శాతం రిజర్వేషన్లు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎందుకో బీసీలంతా ఐక్యంగా ఉండి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ… రాజ్యాంగ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, విద్యార్థి, మహిళా, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.


Advertisement


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.