హైదరాబాద్, జూన్ 26, అద్దం న్యూస్ : మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని చిక్కడపల్లి డివిజన్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ( ఏసిపి ) రమేష్ కుమార్ అన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. గురువారం రాంనగర్ ఓ ప్రైవేట్ స్కూల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసిపి రమేష్‌కుమార్, ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాంబాబు లు హాజరై పాఠశాల ప్రిన్సిపాల్, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ర్యాలీని రాంనగర్ చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసిపి రమేష్ కుమార్ మాట్లాడుతూ… మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం వల్ల శారీరక హింస, లైంగిక వేధింపులు, ఆకలి, నిద్రలేమి, అనారోగ్యాలను ఎదుర్కొంటారన్నారు. డ్రగ్స్ వాడకం వల్ల అనేక శారీరక గుండె సమస్యలు, కాలేయ వ్యాధులు, మానసిక డిప్రెషన్, ఆందోళన, మతిభ్రమణం సమస్యలు తలెత్తుతాయన్నారు. మన చుట్టూ ఏదైనా అనుమానాస్పద కార్యకలాపం కనిపించినా, మానవ అక్రమ రవాణా లేదా డ్రగ్స్ సంబంధిత సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. ఈ అవగాహన ర్యాలీలో 8, 9, 10 వ తరగతులకు చెందిన దాదాపు 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారితో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png















Leave a Reply