...

మినీ మ‌హానాడు ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన టిడిపి నేత‌లు

మినీ మ‌హానాడు ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన టిడిపి నేత‌లు

హైదరాబాద్, మే 15, ( అద్దం న్యూస్ ) :   ఈ నెల 17వ తేదీన జ‌రుగ‌నున్న తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ మినీ మ‌హానాడు కార్య‌క్ర‌మం ఏర్పాటు ప‌నుల‌ను ఆ పార్టీ నాయ‌కులు నల్లెల్ల కిషోర్, శ్రీపతి సతీష్, పోల్లంపల్లి అశోక్, నాకు నగేష్, బాలరాజ్ గౌడ్ త‌దిత‌ర నేత‌లు శుక్ర‌వారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా నల్లెల్ల కిషోర్ మాట్లాడుతూ… ఈ నెల 17వ తేదీన హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో సికింద్రాబాద్ పార్ల‌మెంట్ మినీ మ‌హానాడు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ మినీ మ‌హానాడుకు టిటిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యులు బ‌క్క‌ని న‌ర్సింహులు, అర‌వింద్ కుమార్ గౌడ్‌, న‌ర్సిరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌వుతార‌ని తెలిపారు. హైద‌రాబాద్‌, సికింద్రాబాద్ న‌గరాల్లోని నియోజ‌క‌వ‌ర్గాలు, డివిజ‌న్ల‌కు చెందిన టిడిపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున హాజ‌రై ఈ మినీ మ‌హానాడును విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి నాయ‌కులు పరశురాం, సుదర్శన్ రెడ్డి, వినోద్ నేత, అనిల్ కుర్మా, ఎం.శ్యాంసుందర్, కిరణ్ కుమార్, భాను ప్రకాష్, శుక్ర వేది, ప్రకాష్, రోహిత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.