గాంధీ చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించిన టిడిపి నేత‌లు

గాంధీ చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించిన టిడిపి నేత‌లు

హైదరాబాద్, జ‌న‌వ‌రి 30, అద్దం న్యూస్ :   మ‌హాత్మాగాంధీ వ‌ర్థంతి కార్య‌క్ర‌మం శుక్ర‌వారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నాయ‌కులు న‌ల్లెల్ల కిషోర్‌, పి.బాల్‌రాజ్‌గౌడ్ లు హాజ‌రై గాంధీ చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… అహింసా పరమో ధర్మం అనే సూక్తిని నమ్మి, సత్యాగ్రహమే ఆయుధంగా స్వాతంత్య్ర‌ సమరం సాగించి యావత్ భారతదేశాన్ని ఏకం చేసిన ఘనుడు గాంధీ అని అన్నారు. సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని దేశం నుండి తరిమి, తెల్ల దొరల పాలన నుంచి దేశానికి విముక్తి ప్రసాదించిన మ‌హానేత గాంధీ అని కొనియాడారు. ఆ మహనీయుని ఆశయాలకు.. ఆదర్శాలకు అంకితమై తెలుగుదేశం పార్టీ ఆయన చూపిన బాటలోనే సమాజానికి అహింసా విదానంతో పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి న‌గ‌ర నాయ‌కులు కరణం కిరణ్, భాను ప్రకాష్, ఎస్.ప్రకాష్, డి.చంద్రమోహన్ గౌడ్, సత్యనారాయణ, బి.రాజు, నటరాజు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page