...

చిక్క‌డ‌ప‌ల్లిలో ఘ‌నంగా టిడిపి 43వ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు

హైదరాబాద్, అద్దం న్యూస్ :  తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లను పుర‌స్క‌రించుకుని హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లి శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వీధిలో పేద‌ల‌కు పులిహోర ప్యాకెట్ల పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. టిడిపి రాంన‌గ‌ర్ డివిజ‌న్ అధ్య‌క్షుడు డి.చంద్ర‌మోహ‌న్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం జ‌రిగిన ఈ కార్య‌క్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్‌గౌడ్‌లు హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా వారు ఎన్‌టిఆర్ చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా పేద‌ల‌కు పులిహోర ప్యాకెట్ల‌ను అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ‌లో అభివృద్ధి చేసింది టిడిపి హ‌యాంలోనే అని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి నాయ‌కులు శివ‌కృష్ణ‌, సాగ‌ర్‌, శంక‌ర్ గౌడ్‌, గోపాల్ నాయుడు, ఉద‌య్ కుమార్ గుప్త‌, శ్రీనివాస్‌, పుల్ల‌య్య‌, సాయి, అన్న‌పూర్ణ‌, వేణి త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.