Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర..

Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా మహిళా క్రికెట్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) టీ 20ల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా కొత్త చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో జరుగుతున్న టీ 20 సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ గెలుపుతో ఆమె మెగ్ లానింగ్ రికార్డును అధిగమించింది. మరోవైపు టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ టీ 20ల్లో 1000 పరుగులు, 150 వికెట్లు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచింది. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.

శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా, ఈ గెలుపుతో మహిళల టీ 20ల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ (Harmanpreet Kaur) కొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు హర్మన్ ప్రీత్ (Harmanpreet Kaur) 130 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి, 77 విజయాలు నమోదు చేసింది. ఇదే సమయంలో టీ 20ల్లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా కొనసాగిన ఘనత కూడా హర్మన్‌ప్రీత్‌ (Harmanpreet Kaur)కే దక్కింది.

ఈ గెలుపుతో శ్రీలంకతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 3 – 0తో మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం హర్మన్‌ప్రీత్ (Harmanpreet Kaur) మాట్లాడుతూ టీ20 వరల్డ్‌కప్‌కు ముందు తమ ఆటను మరో స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని, ఈ సిరీస్‌లో బౌలింగ్ విభాగం అద్భుతంగా పనిచేసిందని పేర్కొంది. భారత్ – శ్రీలంక మధ్య నాలుగో టీ 20 మ్యాచ్ డిసెంబర్ 28న తిరువనంతపురంలో జరగనుంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page