వీర జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్‌కు క‌న్నీటి వీడ్కోలు – ముర‌ళీ నాయ‌క్ కుటుంబానికి 50 ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం, 5 ఎక‌రాల భూమి, 300 గ‌జాల ఇంటి స్థ‌లం – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

 

ముర‌ళీ నాయ‌క్ కుటుంబానికి

50 ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం, 5 ఎక‌రాల భూమి, 300 గ‌జాల ఇంటి స్థ‌లం 

– డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

 

వీర జవాన్ మురళీ నాయక్‌కు నివాళులర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్

వీర జవాన్ మురళీ నాయక్‌కు నివాళులర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్

 

ఆంధ్రప్ర‌దేశ్‌, అద్దం న్యూస్ :    పాక్ కాల్పుల్లో మృతి చెందిన వీర జవాన్ మురళీ నాయక్‌కు ఆయన సొంత ఊరిలో ప్ర‌జ‌లు ఆయ‌న‌కు కడసారి వీడ్కోలు పలికారు. సత్యసాయి జిల్లాలో వీర జవాన్ మృతదేహంపై పూలమాలలు వేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి అనిత, సత్య కుమార్ యాదవ్, సవిత, ఎంపీ పార్థసారథితోపాటు పలువురు ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్థిక సాయంతో పాటు 5 ఎకరాల భూమి, 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. తన వ్యక్తి గతంగా రూ.25 లక్షలు ఆర్థిక సాయం చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page