హైదరాబాద్, అద్దం న్యూస్ : టెక్ మహీంద్రా ఆధ్వర్యంలో నిరుద్యోగులకు కంప్యూటర్ శిక్షణ.. ఉద్యోగాల పై అప్సా -టెక్ మహీంద్రా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్, పార్శిగుట్ట తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం జరిగింది. ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉద్యోగాల అవకాశాలపై ఇంటి ఇంటికి వెళ్లి కర పత్రాలను పంచిపెడుతూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సెంటర్ మేనేజర్ షేఖ్ మౌల మాట్లాడుతూ… చదువుకు తగిన ఉద్యోగం రావాలంటే తగిన నైపుణ్యం పెంపొందిచుకోవాలని, మా సంస్థ పేద, మధ్య తరగతి యువతీ, యువకులకు ఉపాధి కలిపించడానికి టెక్ మహీంద్రా ఫౌండేషన్ సామాజిక విభాగంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కలిపించాలనే ఉద్దేశంతో కంప్యూటర్ శిక్షణ అడ్వాన్స్ ఎక్సెల్, టాలీ ప్రైమ్, పవర్ BI, టైపింగ్, దానితో పాటు ఆంగ్లంలో మాట్లాడే నేర్పు, ఇంటర్ నెట్ పరిజ్ఞానం, నైపుణ్యత శిక్షణ లాంటి శిక్షణలు ఉచితంగా నేర్పబడుతుందన్నారు. ఈ శిక్షణలో 18 నుండి 27 యేండ్లు నిండి 10 తరగతి పాస్, ఇంటర్, డిగ్రీ ఫెయిల్ లేదా పాస్ అయిన వారికి మూడు నెలల శిక్షణతో పాటు ప్రతి ఒక్కరికి ఉచితంగా శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్‌తో పాటు ఉద్యోగాలు ఉచితంగా అందిస్తామని అన్నారు. 
ఈ శిక్షణలో చేరు వారు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, ఆధార్ జిరాక్స్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో ముషీరాబాబు చౌరస్తా సమీపంలోని ఆక్సిస్ బ్యాంకు వీధిలో ఎవర్ గ్రీన్ ఫ్రెండ్స్ అస్సోసిషన్ కమ్యూనిటీహాల్‌లో అప్సా టెక్ మహీంద్రా స్మార్ట్ శిక్షణ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. ఇతర వివిరాలకు ఫోన్ నంబర్ 91549 90133 సంప్రదించాలని తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply