హైదరాబాద్, జూన్ 2, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యాలయం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కె.ఉపేందర్ రెడ్డి హాజరై ప్రొఫెసర్ జయశంకర్, డాక్టర్.బిఆర్. అంబేద్కర్ ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి.పద్మజ, సిటీ సెంట్రల్ లైబ్రరీ గ్రేడ్-1 గ్రంధపాలకులు చంద్రకళ, సిటీ సెంట్రల్ లైబ్రరీ గ్రేడ్ -1 గ్రంధపాలకులు సుబ్బలక్ష్మి, కార్యాలయ సిబ్బంది, సాంకేతిక విభాగం సిబ్బంది, నగర గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ విద్యార్ధులు తదితరుల పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply