కాలేజీల బంద్ చూసైన కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలి

హైదరాబాద్ బ్యూరో, జూలై 2, ( అద్దం న్యూస్ ) : ఫీజు రియింబర్స్‌మెంట్ అమలు చేయాలని, ఫీజుల బకాయిలు తక్షణమే చెల్లించాలనే ప్రధాన డిమాండ్‌తో బీసీ జేఏసీ ఇచ్చిన కాలేజీల బంద్ వంద శాతం సంపూర్ణంగా విజయవంతం జరిగిందని, బందు సందర్భంగా వేలాది కాలేజీలు మూతపడ్డాయని, లక్షల మంది విద్యార్థులు బంద్‌లో పాల్గొన్నారని, కాలేజీల బంద్ చూసైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. గురువారం కాలేజీల బంద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా వేలాది ఇంటర్, డిగ్రీ, పీజీ ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్య కాలేజీలు ఒకరోజు ముందుగానే సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలోని పల్లె జిల్లాల్లో స్వల్పంగా కళాశాలలు ఓపెన్ చేయడంతో బీసీ సంఘాల కార్యకర్తలు కాలేజీలో ముందు ఆందోళన చేపట్టి సంపూర్ణంగా బంద్ చేయించడం జరిగింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని బర్కత్ పురలో జరిగిన విద్యార్థుల ఆందోళనలో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, బిఆర్ఎస్ శాసనసభ పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల రియింబర్స్‌మెంట్ రద్దు చేయాలని కుట్రతోని హైకోర్టులో ఫీజు రియింబర్స్‌మెంట్ కేసులు అడ్వకేట్ జనరల్ హాజరు కాకుండా, ప్రభుత్వం తరఫున ఆపిడబిట్ వేయకుండా ఉండటంతో రాష్ట్ర హైకోర్టు విద్యార్థుల వద్ద నుండి ఫీజులు వసూలు చేయాలని తీర్పు ఇచ్చిందని ఆయన ఆరోపించారు, ప్రభుత్వం అనుకున్న కోర్టు కేసులలో కోట్ల రూపాయలు వెచ్చించి ఢిల్లీ కెళ్ళి న్యాయవాదులను రప్పించి కేసులు వాదిస్తున్న ప్రభుత్వం, ఫీజు రియింబర్స్‌మెంట్ కేసులో మాత్రం కనీసం అడ్వకేట్ జనరల్ కూడా హాజరు కావడం లేదంటే ప్రభుత్వం ఉద్దేశం స్పష్టంగా అర్థమవుతుందని ఆయన తెలిపారు. ఏపీ ప్రభుత్వం చూసైనా తెలంగాణ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలనీ, వంద శాతం ఫీజు రియింబర్స్‌మెంట్ పథకం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం వంద శాతం ఫీజుల రియింబర్స్‌మెంట్ స్కీమును అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత మూడు బడ్జెడ్‌లలో నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసి బడా కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం దోచిపెడుతున్నది తప్ప, పేద విద్యార్థుల ఫీజుల బకాయిల కోసం కనీసం రూ.7000 కోట్లు ఇవ్వడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాంట్రాక్టర్ల కోసమా.. పేద విద్యార్థుల కోసం అంటూ ఆయన మండిపడ్డారు. గురువారం జరిగిన కాలేజీల బంద్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక శాంపిల్ మాత్రమేనని, ప్రభుత్వం దిగివచ్చి ఫీజుల రియింబర్స్‌మెంట్ అమలు చేయకపోతే తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తితో, జెన్ జీ ఆదర్శంతో ప్రభుత్వం పై విద్యార్థులు తిరగబడిన రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
రాష్ట్రంలో 14 లక్షల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పేద విద్యార్థుల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వం తగులుతుందన్నారు. తమ జాతికి ఇంత అన్యాయం జరుగుతున్న కనీసం నోరు మెదపని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 15 న వేలాది మంది ఛలో హైదరాబాద్‌కు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.
బిఆర్ఎస్ శాసన పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులకు ఫీజులు ఇస్తరో, గద్దె దిగుతరో తేల్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు, ఫీజులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు విద్యార్థులను తీవ్రంగా వేధిస్తున్నధని, ఈ ప్రభుత్వం ముమ్మాటికి విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమనీ ఆయన ఆరోపించారు. ఫీజు రియింబర్స్‌మెంట్ సాధన కోసం బీసీ చేసి చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. ఈ ఆందోళనలో బిసి జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనుకల శ్యాంకుర్మా, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరసింహ నాయక్, బిజీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తారకేశ్వరి, సమతా యాదవ్, నందగోపాల్, పానుగంటి విజయ్, బూడిద మల్లికార్జున యాదవ్, వేముల రామకృష్ణ, ఉదయనేత, గౌతమి, గూడూరు భాస్కర్, సత్య గౌడ్, మహేష్ మేరు, అర్జున్, తదితరులు పాల్గొన్నారు.














Leave a Reply