Friday, September 18, 2026
HomeGREATER HYDERABADఉద్యమకారుడు సిరిగిరి శ్యామ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు 

ఉద్యమకారుడు సిరిగిరి శ్యామ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు 

 ఉద్యమకారుడు సిరిగిరి శ్యామ్ ఆధ్వర్యంలో
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, జూన్ 2, ( అద్దం న్యూస్ ) :   తెలంగాణ ఉద్యమకారుడు, ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు సిరిగిరి శ్యామ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిహెచ్ఎంసి మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డి హాజరై జాతీయ జెండా, పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వందలాది మంది ఉద్యమకారుల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కేసీఆర్ చేపట్టిన ఉద్యమంతో అప్పటి కేంద్రం దిగి వచ్చి రాష్ట్రాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వ గోపి, రాకం సత్యనారాయణ, వెంకటేష్, అమిత్ రావు, అరుణ్, విక్కి అరవింద్, రమేష్, జుగేందర్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page