తెలంగాణ సినిమా పాలసీని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి
– తెలంగాణ పరిరక్షణ వేదిక

మాట్లాడుతున్న డాక్టర్.పసునూరి రవీందర్
హైదరాబాద్, మే 18, అద్దం న్యూస్ : తెలంగాణ సినిమా పాలసీని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) డిమాండ్ చేసింది. ఆదివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ సినిమా రంగం, అభివృద్ధి–అవరోధాల పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. డాక్టర్.పసునూరి రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, తెలంగాణ పరిరక్షణ వేదిక ( టిపిఎఫ్ ) రాష్ట్ర గౌరవ సలహాదారులు తుమ్మల ప్రఫూల్ రాంరెడ్డి, రాష్ట్ర కన్వీనర్ లారా, కో-కన్వీనర్ మోహన్ బైరాగి, సినిమా రంగానికి సంబంధించిన సయ్యద్ రఫీ, ప్రసేన్, ప్రవీన్ చందర్, ఖాజా మన్సూర్, పెద్దింటి అశోక్ కుమార్, చల్లా శ్రీనివాస్, అక్షర కుమార్, రమేష్ కిషన్ గౌడ్‌లతో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తయ్యాయని, అయినా తెలంగాణ సినిమా రంగం సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. తెలంగాణ సినిమాను ప్రోత్సహించేలా పాలసీని ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ సినిమా నిర్మాణానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని, తెలంగాణ సినిమాకు పన్ను మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ సినీ పరిశ్రమను ఏర్పాటు చేసుకునేందుకు తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ను ఏర్పాటు చేయాలన్నారు.












Leave a Reply