జంట బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం  – బీజేపీ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ఎన్.గౌతమ్ రావు

 

అంబ‌ర్‌పేట్‌, ఏప్రిల్ 8, అద్దం న్యూస్  దిల్‌షుఖ్‌న‌గ‌ర్ జంట బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమ‌ని బీజేపీ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ఎన్.గౌతమ్ రావు మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదులకు ఉరిశిక్ష వేయడం సంతోషదాయకమని తెలిపారు. బాంబు పేలుళ్ల ఘటన జరిగిన 2013 నుంచి బాధితుల బాధలు వర్ణనాతీతమన్నారు. బాంబు పేలుళ్లతో కొంత మంది కుటుంబ సభ్యులను కోల్పోగా… ఆ ఘటనలో గాయపడిన మరి కొందరు నరకయాతన అనుభవిస్తూ కాలం వెలదీస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దోషులను పట్టుకుని శిక్ష పడటంలో చురుకుగా వ్యవహరించిన ఎన్ఐఏ పోలీసుల పాత్ర, విచారణ అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, ఉగ్రవాదాన్ని ఎవ్వరూ .. ఎట్టి పరిస్థితుల్లో సమర్ధించవద్దని తెలిపారు. ప్రభుత్వాలు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని కోరారు. ఉగ్రవాదం విషయంలో ఏట్టి పరిస్థితుల్లో రాజీ పడొద్దని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాజకీయ పార్టీలు పాకులాడవద్దన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page