హైదరాబాద్, అద్దం న్యూస్ : అమలు పర్చని కాంగ్రెస్ అభయ హస్తం 6 పథకాల మాదిరిగానే రాష్ట్ర బడ్జెట్ ఉందని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. బుధవారం కార్పొరేటర్ కార్యాలయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విలేఖరులతో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రవేశ పెట్టిన రెండవ బడ్జెట్ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఆమోదకరంగా అస్సలు లేదని, మరోసారి, పేదలకు, రైతులకు, మహిళకు మొండి చెయ్యి చూపిందని అన్నారు.
అమలు కానీ మహిళలకు 2500 రూపాయల మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత పథకం ద్వారా 4000 రూపాయల పెన్షన్ల హామీలన్నీ వృధా ఉపన్యాసాలకై పరిమతమయ్యయని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకే సారి ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని కార్పొరేటర్ పావని సూచించారు. గత ప్రభుత్వ నిర్వాహకానికి ఇప్పటికీ కనీస వేతనాలకు నోచుకోని పలు విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్ పై ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply