Saturday, September 19, 2026
No menu items!
HomeTelanganaతెలుగుదేశం పార్టీ జన్మస్థానం తెలంగాణలోనే – టిడిపి పొలిటి బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్

తెలుగుదేశం పార్టీ జన్మస్థానం తెలంగాణలోనే – టిడిపి పొలిటి బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, అద్దం న్యూస్ : ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారం హస్తగతం చేసుకుంటుందని టిడిపి పొలిటి బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జన్మస్థానం తెలంగాణ గడ్డ మీద న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ ఆదర్శనగర్‌లో పార్టీని 1982 మార్చ్ 29వ‌ తేదిన దివంగ‌త నేత ఎన్‌టిఆర్ స్థాపించారన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయం నందు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి టిడిపి పొలిటి బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా మొదటగా పార్టీ పతాకావిష్కరణ చేసి, వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా పారిశుద్ధ్య కార్మికుల‌కు చీర‌ల‌ను ఉచితంగా అంద‌చేశారు. ఈ సందర్భంగా అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ జన్మస్థానం తెలంగాణ అని అన్నారు. సినీరంగంలో 60 సంవత్సరాలకు పైగా ఏకచిత్రాధిపత్యంతో వెలుగొందుతున్న ఎన్‌టి రామారావు తనకు ఇంత హోదా ఇచ్చిన తెలుగు ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో, తెలుగు ప్రజలు తన కిచ్చిన గౌరవానికి ప్రతికగా తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. సేవాభావంతో పుట్టిన పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీనే అని అని అన్నారు. తెలుగుదేశం పార్టీ కంటే ముందు ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తే, కేవలం నాయుకులు తమ స్వార్థ రాజకీయ స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేశార‌న్నారు. కేవలం అగ్రవర్ణాల చేతిలో అధికారం ఉండి ప్రజలు కేవలం ఓటర్లుగా బావించే సంయంలో సామాజిక న్యాయం అనే నినాదంతో ప్రతి పేదవాడికి “కూడు గూడు గుడ్డ” అనే నినాదంతో, ఒక మంచి ఆశయంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడం జరిగిందని తెలిపారు. దేశ చరిత్రలో గానీ, రాష్ట్ర చరిత్రలో గానీ, ప్రపంచ చరిత్రలో గాని పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారాన్ని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు. అధికారంలోకి వస్తూనే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అప్పటి ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినప్పటికీ, 2 రూపాయ‌లకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు వంటి చేసిన వాగ్దానాలన్నీ తూచా తప్పకుండా అమలు చేసారన్నారు. సేవా భావంతో నెలకొల్పి కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి వారిలో సేవా నిరతిని చాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు సంస్కరణలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బాగుపరిచి పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లార‌న్నారు. ఆనాడు రాష్ట్రం నుండి ఇంజనీరింగ్ మెడికల్ విద్య చదవాలంటే పక్క రాష్ట్రాలకు వలస పోవాల్సిన గత్యంతరం ఉన్న సమయంలో కాలేజీలను ఎన్నో విద్యా సంస్థలను నెలకొల్పారన్నారు. ఇటీవల తెలుగుదేశం చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రజలు స్వ‌చ్ఛందంగా 2 లక్షలకు పైగా సభ్యత్వ నమోదు చేసినప్పటికీ అందులో 1,20,000 పైగా నూతన క్రియాశీల సభ్యత్వం కాగా, 80 వేల సభ్యత్వాలు రెన్యువల్ చేసుకున్నారన్నారు.ఆనాడు ఏ విధంగా పటేల్ పట్వారి వ్యవస్థ రద్దుచేసి ప్రజలకు సుఖశాంతులను కలుగజేసిన తెలుగుదేశం, ఈనాటి రాజకీయ పరిస్థితులు చూస్తుంటే కొన్ని పార్టీలు మళ్లీ అదే పెత్తందారీ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు. గత 10 సంవత్సరాల కాలాన్ని చూసి అంచనా వేయవచ్చు, అటువంటి రాజకీయ వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించి, తిరిగి ప్రజాస్వామ్యాన్ని పరిడవిల్లేలా తెలుగుదేశం పార్టీ నిరంతరం ప్రజల పక్షాన ఉండి పోరాడుతుందని అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు అధ్యక్షులు సాయిబాబా మాట్లాడుతూ… ఎన్‌టి రామారావు ఒక దేవుడిలా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని అన్నారు. జంట నగరాలుగా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్‌ల‌కు 3వ నగరంగా సైబరాబాద్‌ను సృష్టించి ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల్ల కిషోర్, బాలరాజు గౌడ్, టిడిపి నాయ‌కులు ఎస్.ప్రకాష్, రాజు, ఝాన్సీ, ప్రమీల, మహానంది, గండికోట విజయ్, సి.విట్టల్, పరశురామ్, భాను ప్రకాష్, కిరణ్, సత్యనారాయణ, అడ్డగుట్ట విజయ్, అమ్మినాయుడు, ప్రదీప్ గౌడ్, శ్యాంసుందర్, ప్రవీణ్, తడక వినోద్, ఎండి సలీం, రామదాసు, జగదీష్ గౌడ్, సాయి, ధనరాజ్, శుక్రవేది తదితరులు పాల్గొన్నారు,

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page