ఎన్‌టిఆర్‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాలి

తెలుగు ఖ్యాతిని ప్ర‌పంచ‌స్థాయికి తీసుకెళ్లిన
ఎన్‌టిఆర్‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాలి
– మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్‌గౌడ్‌

హైద‌రాబాద్‌, మే 28, ( అద్దం న్యూస్ ) :  తెలుగు జాతి ఖ్యాతిని ప్ర‌పంచ‌స్థాయికి తీసుకెళ్లిన ఎన్‌టిఆర్‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నాయ‌కుడు, మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్‌గౌడ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం హైదరాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్కడపల్లిలో ఘనంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్‌ నియోజకవర్గం నాయకుడు, మాజీ కార్పొరేటర్ పలుస బాల్‌రాజ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఎన్‌టిఆర్‌ ఘాట్ ను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అశోక్‌న‌గ‌ర్‌ చౌరస్తాలో, ముషీరాబాద్ డివిజన్ బాపూజీనగర్‌ల‌లో గల ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిక్కడపల్లిలోని పేదలకు పులిహోర ప్యాకెట్లను అందజేశారు.

 ఈ సందర్భంగా బాల్‌రాజ్‌గౌడ్‌ మాట్లాడుతూ… తెలుగు జాతి కీర్తిని, భారతదేశ చలనచిత్ర రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని తీసుకొచ్చిన ఘనత ఎన్‌టిఆర్ ది అని అన్నారు. రాజకీయ పార్టీ పెట్టి ప్రభుత్వంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే రెండు రూపాయలకే కిలో బియ్యం, రోటీ.. కపడా… మఖాన్ నినాదంతో తెలంగాణ పెత్తందార్ల రాజకీయ పోకడలను తిప్పి కొట్టి ప్రజారాజ్యాన్ని తెచ్చిన మహానీయుడు ఎన్‌టిఆర్‌ అని కొనియాడారు. ఎన్‌టిఆర్ బాటలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్‌లో హైటెక్ సిటీని స్థాపించి తెలంగాణను అభివృద్ధి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు డి.చంద్రమోహన్ గౌడ్, బి.రాజు, గణేష్, గోపాల్, యాదగిరి, సుబ్బయ్య, శంకర్ గౌడ్, పుల్లయ్య, అన్నపూర్ణ, వీణా దేవి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page