మందకృష్ణ మాదిగ నాయ‌క‌త్వంతోనే వ‌ర్గీక‌ర‌ణ సాధ్య‌మైంది

హైదరాబాద్, అద్దం న్యూస్ :    పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయ‌క‌త్వంతో, మాదిగ అమరవీరుల త్యాగాలతో వ‌ర్గీక‌ర‌ణ సాధ్య‌మైందని ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర నాయ‌కులు గండి కృష్ణ మాదిగ‌, ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఇన్‌చార్జ్ గ‌జ్జ‌ల రాజ‌శేఖ‌ర్ మాదిగ లు అన్నారు. గురువారం హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని అడిక్‌మెట్ డివిజ‌న్ రాంన‌గ‌ర్ గుండు చౌర‌స్తా వ‌ద్ద ఎంఆర్‌పిఎస్ జెండా ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా వారు జెండానావిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మంద‌కృష్ణ మాదిగ చిత్ర ప‌టానికి పాలాభిషేకం చేశారు.  అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఏకగ్రీవ ఆమోదం పొందడం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సంవత్సరాలు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం విజయమ‌న్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్ నాయ‌కులు చిలక ఎల్లయ్య మాదిగ, చేత సోమయ్య మాదిగ, తొట్ల గోపి మాదిగ, రామస్వామి మాదిగ, నిరంజన్ మాదిగ, గిరి మాదిగ,  మహేందర్ మాదిగ, అమ్ముగూడెం దశరథ్ మాదిగ, రోషన్ వినాయక రావు మాదిగ, దేశ్ పాండే నాగరాజు మాదిగ, సుంచు బాలరాజు మాదిగ, మహంకాళి వెంకటయ్య మాదిగ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page