Saturday, September 19, 2026
No menu items!
HomeTelanganaకాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను నెరవేర్చాలి – తెలంగాణ ఉద్యమకారుల జాయింట్...

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను నెరవేర్చాలి – తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్‌

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, అద్దం న్యూస్ :  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను నెరవేర్చాలని, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి, జేఏసీ రాష్ట్ర సెక్ర‌ట‌రి జ‌న‌ర‌ల్ తుమ్మ‌ల ప్రఫుల్ రాంరెడ్డి, జేఏసీ గౌరవ అధ్యక్షుడు రంగారెడ్డి లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం జేఏసీ రాష్ట్ర సెక్ర‌ట‌రి జ‌న‌ర‌ల్ తుమ్మ‌ల ప్రఫుల్ రాంరెడ్డి అధ్యక్షతన హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సంద‌ర్భంగా చైర్మన్ సుల్తాన్ యాదగిరి, జేఏసీ రాష్ట్ర సెక్ర‌ట‌రి జ‌న‌ర‌ల్ తుమ్మ‌ల ప్రఫుల్ రాంరెడ్డి, జేఏసీ గౌరవ అధ్యక్షుడు రంగారెడ్డి లు మాట్లాడుతూ.. ఉద్యమకారులకు ఉచిత బస్సు పాసులు 250 గజాలు ఇంటి స్థలంలో పాటు నాలుగు గదుల ఇల్లు నిర్మించి అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలలో ఉద్యమకారులను మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇతర రాష్ట్రాల్లో ఉద్యమకారులకు ఆర్థిక సహకారాలు అందిస్తున్నట్లుగా తెలంగాణ ఉద్యమకారులకు నెలకు రూ.30 వేల రూపాయ‌ల‌ గౌరవ వేతనాన్ని ప్రతినెలా ఇవ్వాలని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఉద్యమంలో పని చేసి లబ్ధి పొందని కళాకారులను సాంస్కృతి సారధిలోని వివిధ పోస్టులలో అవకాశం ఇవ్వాలన్నారు. అమరవీరుల స్మృతి వనము 100 ఎకరాలలో ఏర్పాటు చేసి ఉద్యమకారులకు ఆరోగ్య భీమా రూ.20 లక్షల వరకు ఏర్పాటు చేసి ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు సంక్షేమ నిధిని అందించి తెలంగాణ ప్రతి జిల్లాలోని అమరులైన ఉద్యమకారులకు స్మారక భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నాయకులు ఓయూ జేఏసీ నాయకులు బద్రి, ఆనంద్, బత్తుల సొమ్మ, రాజేంద్రప్రసాద్ మోహన్ బైరాగ, యాదగిరి, కోతి మాధవి, పద్మ, సుదర్శన్, చంద్రన్న, ప్రసాద్, శంకర్‌రావు, కొంపల్లి సాయిలు, బాబు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page