దేశంలో తీవ్రమైన ఫాసిస్టు పాలన కొనసాగుతుంది
– రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
హైదరాబాద్, అక్టోబర్ 25, అద్దం న్యూస్ : దేశంలో తీవ్రమైన ఫాసిస్టు పాలన కొనసాగుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సంక్షోభ కాలం రాజ్యాంగ హక్కులు అంశంపై ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక నాయకులు వంగాల సంతోష్, రైతు-కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పట్లోళ్ల నాగిరెడ్డి, వెలుతురు సదానందం లు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ సమావేశానికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రెండు తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క, మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, కట్టా భగవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపి మల్లు రవి, ప్రొఫెసర్ కొండా నాగేశ్వరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ నాయకులు అబ్బాస్, ఎంసిపిఐ రాష్ట్ర నాయకులు మస్కుల మట్టయ్య, కాశం సత్యనారాయణ, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్, ఏఐటియుసి నాయకులు బాల్ రాజు, రాష్ట్ర నాయకులు పరమేష్, టిపిటిఎఫ్ రాష్ట్ర నాయకులు ప్రకాష్ సార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు నేడు దేశంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలను తీవ్రంగా ఖండిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆదివాసుల పై,మావోయిస్టు లపై ఆపరేషన్ కాగర్ పేరుతో గత 22 నెలల కాలంగా మానవ హనానికి పాల్పడం సరైంది కాదన్నారు. పిడికెడు మంది కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు నెరవేర్చడం కొరకు ఈ దేశ ప్రజల పై ఈ దేశ పాలకులు ఏక పక్షంగా కాల్పులకు తెగబడుతూ రాజ్యాంగం కల్పించిన మనిషి జీవించే హక్కును కాలరాస్తున్నారన్నారు. బిజెపి ప్రభుత్వం పాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా అందరం ఐక్యమై పోరాడుదామని పిలుపునిచ్చారు. ప్రజలను హింసించి చంపితే, ప్రజాస్వామ్యం అవుతుందా అని పాలకులను ప్రశ్నించారు. అట్లాగే సనాతన ధర్మం పేరా విద్యాలయాలను భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు.

Advertisement
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply