హైదరాబాద్, జూన్ 9, అద్దం న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వంలో బాంచన్ నీ కాల్మొక్త దొరా అనే రోజులు వచ్చాయని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా అన్నారు. సోమవారం హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం చేసామంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. సామాజిక న్యాయం లేదు.. ఏమీ లేదు తమ పార్టీలో ఉన్న అసంతృప్తిని చల్లార్చుకోవడానికి ఏదో ఒక కారణాలు వెతుక్కుంటున్నారని, సామాజిక న్యాయం చేశామంటూ చంకలు చరుచుకుంటున్నారని విమర్శించారు. సామాజికంగా న్యాయం చేశామంటూ వాళ్లకు వాళ్లే సంతృప్తి చెందడం సంకుచిత మర్దనంతోటే సమానం అని అన్నారు. ఎక్కడ సామాజిక న్యాయం ఉందని ప్రశ్నించారు. ప్రాధాన్యత కలిగిన పదవులన్నీ అగ్రవర్ణాలకు ఇచ్చి, ప్రాతినిధ్యం లేని పనికి రాని పదవులన్నీ బలహీనవర్గాలకు, నిమ్నజాతి వాళ్లకు కట్టబెట్టడం సామాజిక న్యాయమా ? ఇదెక్కడి సామాజిక న్యాయం అని ప్రశ్నించారు. నగరంలో కోటి 20 లక్షల జనాభా కలిగి ఉన్న ప్రాంతానికి కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వకపోవడం ఇదెక్కడి సామాజిక న్యాయమని సాయిబాబా అన్నారు. దగ్గు గోలి కోసం ఢిల్లీకి పోయి డబ్బులు తెచ్చుకునే దౌర్భాగ్య పరిస్థితిలు మళ్లీ తెలుగువాడికి దాపురించాయని ఆవేదన వ్యక్తం చేసారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి పూర్వం 1982 కు ముందు తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో, బాంచన్ నీ కాల్మొక్త దొరా వంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం అయినట్లు ఈ ఢిల్లీ కాంగ్రెస్ నాయకులకు గులాంగిరి చేస్తూ పదవులు తెచ్చుకుంటున్న వైనం నశించాలని, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కించ పరచోద్దని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజు గౌడ్, నాయకులు ఎస్.ప్రకాష్, కిరణ్, భానుప్రకాష్, సుక్రవేది తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply