హైదరాబాద్, నవంబర్ 25, అద్దం న్యూస్ :జీవో 46 ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డెవలప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ నేషనల్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో–కన్వీనర్ కాటమోని వెంకటేష్ లు కోరారు. మంగళవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. బిసిల రిజర్వేషన్లను 42 నుంచి 22 శాతానికి తగ్గించం అన్యాయమన్నారు. జీఓ 46 కు వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు మద్దతుగా ఇస్తామన్నారు. వెంటనే 42 రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. దేశంలో 5000 పైగా రకాల బీసీ కులస్తులు ఉన్నారని, అన్ని రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన బిసి రిజర్వేషన్‌ను జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సాగర్, సత్యనారాయణ, చుక్కయ్య తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply