దోమలగూడ హనుమాన్ దేవాలయంలో
కన్నుల విందుగా శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం
ముషీరాబాద్, మార్చి 27, అద్దం న్యూస్ : శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ దోమలగూడలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో శ్రీ హనుమాన్ జయంత్యోత్సవం, రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనుల విందుగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ మాజీ ఎంపీ ఎం.అంజన్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన దోమలగూడ హనుమాన్ దేవాలయం చైర్మన్ కె.రామకృష్ణ ప్రసాద్, ఆలయ ఈవో మాచర్ల దేవనాధం తో కలిసి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్‌కు శాలువా కప్పి ఆలయ కమిటీ చైర్మన్ కె.రామకృష్ణ ప్రసాద్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆర్.రాము, వై.కృష్ణ జె.పరమేశ్వర రావు, ఆర్.వెంకట్ రెడ్డి, శివకుమార్ యాదవ్, మంజులరాణి, ఆలయ ఎక్స్ అఫీషియో మెంబర్ మహేందర్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.













Leave a Reply