...

వైభ‌వంగా మ‌ల్ల‌న్న స్వామి కల్యాణ మ‌హోత్స‌వం

వైభ‌వంగా మ‌ల్ల‌న్న స్వామి కల్యాణ మ‌హోత్స‌వం

హైదరాబాద్, జ‌న‌వ‌రి 16, అద్దం న్యూస్ :     హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ బాకారంలో ప్ర‌సిద్ది చెందిన శ్రీ భ్రమరాంబ‌ మ‌ల్లిఖార్జున‌స్వామి ( మ‌ల్ల‌న్న ) దేవాల‌యంలో జాతర మ‌హోత్స‌వాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఇందులో భాగంగా స్వామివారికి ఎదుర్కోలు, గంగ తెప్పోత్సవం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆల‌య మేనేజింగ్ ట్ర‌స్టీ న‌ల్ల‌వెల్లి అంజిరెడ్డి, మాజీ ఛైర్ ప‌ర్స‌న్ న‌ల్లవెల్లి ఊర్మిళా అంజిరెడ్డి, మ‌ల్లిఖార్జున‌రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స్వామి వారికి క‌ల్యాణ మ‌హోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ క‌ళ్యాణ వేడుక‌కు ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, స‌రోజ దంప‌తులు హాజ‌రై స్వామి వారికి ప‌ట్టు వ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ముఠా జైసింహా, మీడియా ఇన్‌చార్జ్ ముచ్చ‌కుర్తి ప్ర‌భాక‌ర్‌, బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజ‌న్ అధ్య‌క్షుడు కొండా శ్రీధ‌ర్‌రెడ్డి, నాయ‌కులు శ్యామ్,  కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు వైపి.రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

మల్లన్న జాతరలో పాల్గొన్న ఎ.వినయ్ కుమార్ :

శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ‌ మల్లికార్జున స్వామి దేవాలయం జరుగుతున్న జాతరలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మేనేజింగ్ ట్ర‌స్టీ నల్లవెల్లి అంజి రెడ్డి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు దామోదర్, ఆనంద్ రావు, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.