చట్ట వ్యతిరేక ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి
లేకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం
– జాతీయ మాల, మహర్ సంఘాల జేఏసి

హైదరాబాద్, సెప్టెంబర్ 12, అద్దం న్యూస్ : చట్ట వ్యతిరేక ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని జాతీయ మాల, మహర్ సంఘాల తెలంగాణ జేఏసి డిమాండ్ చేసింది. లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని జేఏసి హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని విఎస్‌టి కార్మిక యూనియన్ కార్యాలయంలో జేఏసి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాతీయ మాల, మహర్ సంఘాల తెలంగాణ జేఏసి ఛైర్మన్ మస్త దయానంద్, వర్కింగ్ ఛైర్మన్ మంచాల వెంకటస్వామి, కో-ఛైర్మన్లు నర్మెట్ట మల్లేష్, నీలం పద్మారావు, రవిరాల కాంతయ్య, వైస్ ఛైర్మన్లు నాగుల మారూతి, పెరుమాల్ల వెంకటయ్య, కొల్లూరు లక్ష్మణ్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ రాజ లింగం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ మాల, మహర్ సంఘాల తెలంగాణ జేఏసి ఛైర్మన్ మస్త దయానంద్, వర్కింగ్ ఛైర్మన్ మంచాల వెంకటస్వామి, కో-ఛైర్మన్లు నర్మెట్ట మల్లేష్ లు మాట్లాడుతూ… పలు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేయాలనుకుంటే తొలుత ఎస్సీ కులాల జనగణన చేసి వారి అభివృద్ధి అనుభావిక డేటా సేకరించి ఎస్సీల ఉప వర్గీకరణ చేయాలని 2024 ఆగష్టు 1వ తేదీన సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అనుభావిక డేటా సేకరించకుండా, ఎస్సీల కుల గణన చేయకుండానే అత్యుత్సాహంతో అనాలోచితంగా రాజకీయ లబ్ది కోసం ప్రలోభాలకు లొంగి చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా చేయని, బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా చేయకపోయినా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తన వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఎస్సీ కులాలను వర్గీకరించడం మాల సామాజిక యువతకు తీరని అన్యాయమన్నారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని, లేకుంటే రాష్ట్రంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం హెచ్చరించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply