తక్షణమే హెల్త్ కార్డుల జారీ నిలిపివేయాలి
మినహాయించిన డబ్బులు ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షన్ల ఖాతాలకు జమ చేయాలి
– తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్
హైదరాబాద్, మే 31, ( అద్దం న్యూస్ ) : తక్షణమే హెల్త్ కార్డుల జారీ నిలిపివేయాలని, మినహాయించిన డబ్బులు వెంటనే ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్ల ఖాతాలకు జమ చేయాలని తెలంగాణ స్టేట్ టీచర్ యూనియన్ ( టిఎస్టియు ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ అబ్దుల్లా, చందూరి రాజిరెడ్డి లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆరోగ్య కార్డుల మార్గదర్శకాలు జారీ కాలేదని, ఆస్పత్రులతో చర్చలూ లేవన్నారు. హెల్త్ కార్డుల కొరకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఇంకా తమ తమ ఐచ్చికాల నమోదు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని.. అయినా కూడా మే నెల జీతం నుంచి డబ్బులు ఎలా మినహాయిస్తారు ? అని వారు ప్రశ్నించారు. మరి ఇంతే వేగంతో ప్రభుత్వం మాకు రావాల్సిన 5 డీఏలను ఎందుకు చెల్లించడం లేదు ? అని అన్నారు. సుమారు 3 సంవత్సరాల కాలం నుండి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ( 2023 జులై 1 నుండి ) అమలు కావలసిన నూతన వేతన సవరణ ఎందుకు మర్చిపోయినట్టన్నారు.
ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు ప్రభుత్వ దోపిడీని గుర్తు పట్టలేనంత అమాయకులని అనుకుంటున్నారా అని అన్నారు. అన్ని సంఘాలను పిలిచి వెంటనే పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించి హెల్త్ కార్డు పై చర్చించిన తర్వాతే నిర్ణయించుకోవాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు ఈ పథకంలో చేరాలా లేదా అనే ఆప్షన్ వారికే వదిలివేయాలని డిమాండ్ చేశారు. ఏకపక్ష నిర్ణయాలు సరికాదు భజన సంఘాలతో సమావేశాలను ఒప్పుకోమని వారు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లలో ఆక్రోషం ఆగ్రహం అసమ్మతి పెరిగిపోయిందన్నారు. ముఖ్యమంత్రి వెంటనే ఈ పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని, చర్చల అనంతరమే నిర్ణయం తీసుకొని.. హెల్త్ కార్డు పక్కకు పెట్టి ముందు ఐదు డిఏలు వేతన సవరణపై తేల్చాలని డిమాండ్ చేశారు.![]()

![]()












Leave a Reply