Monday, September 21, 2026
No menu items!
HomeTelanganaబహుజన రాజ్యాధికారానికి బీసీల నాయకత్వం అవసరం

బహుజన రాజ్యాధికారానికి బీసీల నాయకత్వం అవసరం

📰 Generate e-Paper Clip

 

అంబ‌ర్‌పేట్‌, అద్దం న్యూస్ : బహుజన రాజ్యాధికారానికి బీసీల నాయకత్వం అవసరమని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం కాన్షీరాం జయంతిని పురస్కరించుకొని నగరంలోని డిక్కి సమావేశ మందిరంలో సామాజిక న్యాయ జెఏసి చైర్మన్ ప్రొఫెసర్ ప్రభంజన్ కుమార్ యాదవ్ అధ్యక్షతన ప్రత్యేక మాయ బహుజన రాజకీయ పార్టీ అనివార్యం అనే అంశం పైన 101 మంది మేధావులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ ననుమాస స్వామి, ప్రొఫెసర్ వెంకట దాస్, డాక్టర్ ప్రవీణ్, తాళ్లపల్లి శేఖర్ గౌడ్, డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు, బత్తుల సిద్దేశ్వర్, రోజా నేత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బహుజన రాజ్యాధికారం బీసీల నాయకత్వం తోని సాధ్యమైతుందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఐక్యతతో బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేయాలన్నారు. ప్రస్తుతం పరిపాలిస్తున్న పార్టీలతో సామాజిక న్యాయం జరగదని బహుజనుల రాజ్యాధికారంతోనే సామాజిక న్యాయం లభిస్తుందన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page