Monday, September 21, 2026
No menu items!
HomeTelanganaట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు కోసం కృషి చేస్తాం – రాష్ట్ర...

ట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు కోసం కృషి చేస్తాం – రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేష‌న్ చైర్మన్ మెట్టు సాయికుమార్

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : ట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసి పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తాం అని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తెలిపారు. శనివారం హైద‌రాబాద్‌లోని బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రజక ఫిషర్మెన్ సొసైటీల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు రాజీవ్ కుమార్ రజక అధ్యక్షతన రజకుల జన శంఖారావం – రజకుల ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సభకు రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, రజక ఫెడరేషన్ రాష్ట్ర సొసైటీల కమిటీ వ్యవస్థాపక చైర్మన్ అమన గంటి సైదులు రజక హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి ప్రభుత్వం రజకులకు అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి బీసీల పక్షపాతి అన్నారు. ట్యాంక్ బండ్ పై ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసి ఆమె పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు. కులాల అస్థ‌త్వాన్ని కాపాడడానికి ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని.. కుల గణన ద్వారా దాన్ని నిరూపించారన్నారు. రజక

ఫెడరేషన్ జన్మాతగా వచ్చిన హక్కని రజకులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలన్నారు.నాటి నుండి నేటి వరకు శ్రమ చేసే యంత్రాలుగా పనిచేస్తూ అభివృద్ధికి నోచుకునే రజక కులాన్ని కొన్ని కులాల వారు అణిచివేస్తున్నార‌న్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ర‌జ‌కుల‌ శ్రమదోపిడి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడితే మన కులానికి మనమే ద్రోహం చేసిన వాళ్లమవుతామన్నారు. మన కులాన్ని సగౌరవంగా చెప్పుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రజక, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కోశాధికారి నేరెల కుమార్, రాష్ట్ర కార్యదర్శి రామస్వామి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి వడ్డబోయిన మంగ, మహిళా నాయకులు సంధ్య తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page