Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadఅఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం

అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, జూన్  25, అద్దం న్యూస్ :    గత ముప్పై రెండు ఏళ్ళుగా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి గాంధీనగర్ వారి ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజున నిర్వహిస్తూ వస్తున్న అన్నదాన కార్యక్రమం జ‌రిగింది. బుధవారం గాంధీనగర్ డివిజన్‌లోని మాధవరావు లేన్, పంచముఖి కిరణ జనరల్ స్టోర్స్ వద్ద జరిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బీజేపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ పాల్గొని అమావాస్య అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఆయ‌న‌తో పాటు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రసార సమితి సేవ రత్న బ్రహ్మశ్రీ రాజు దేశ్‌పాండే, జాతీయ ప్రచార అధ్యక్షుడు ప్రేమ్ గాంధీ, జాతీయ సలహాదారులు కేశవ్ గురు స్వామి పాల్గొని అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణలో అయ్యప్ప దీక్ష ప్రచార సమితి భాగ్యనగర్ కమిటీ అధ్యక్షుడు సోమిషెట్టి శ్రీనివాస్, శోభన్ బాబు, ఎం.శ్రీధర్ రావు, పి.భూపతి, శ్రీనివాసులు, బీజేపీ డివిజన్ అద్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వి.నవీన్ కుమార్, ఆనంద్‌రావు, బిజెపి నాయ‌కులు శ్రీకాంత్, దామోదర్, ఎం.ఉమేష్, పాల శ్రీను, ఆకుల సురేందర్, సత్తి రెడ్డి, ప్రకాష్ యాదవ్, శ్రీనివాస్, సురేష్, అరుణ్ కుమార్, నీరజ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page