మంచినీటి లో ప్రెషర్ సమస్యను వెంటనే పరిష్కరించాలి
లేదంటే జలమండలి వద్ద ప్రజలతో కలిసి ఆందోళన చేపడుతాం
– కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

జలమండలి అధికారులతో ఫోన్ లో మాట్లాడుతున్న కార్పొరేటర్ పావని వినయ్ కుమార్
హైదరాబాద్, మే 6, అద్దం న్యూస్ : బస్తీల్లో మంచినీటి లో ప్రెషర్ సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో జలమండలి వద్ద ప్రజలతో కలిసి ఆందోళన చేపడుతామని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. ఈ మధ్య కాలంలో విపరీతంగా మారిన మంచినీటి లోప్రెషర్ సమస్య తీవ్రత పై అందిన ఫిర్యాదు మేరకు మంగళవారం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ బీజేపీ శ్రేణులతో కలిసి వాల్మీకినగర్ బస్తీ, వివి గిరి నగర్ బస్తీ, ఎస్ఆర్టి తదితర బస్తీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె స్థానికులతో మాట్లాడి మంచినీటి సమస్యను తెలుసుకున్నారు. కార్పొరేటర్ జలమండలి అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. ఇది వరకే పలుమార్లు వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి సమస్యను వివరించినా ఎందుకు పరిష్కరించడం లేదని అధికారులను ప్రశ్నించారు. వేసవి కాలంలో ప్రజలకు నీటి ఎద్దడి రాకుండా చూడాల్సిన బాధ్యత జలమండలి అధికారులదని, వెంటనే మంచినీటి లోప్రెషర్ సమస్యను పరిష్కరించకుంటే బాధిత ప్రజలతో కలిసి జలమండలి ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని కార్పొరేటర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, విఎస్టి రాజు, మహమూద్, సత్తి రెడ్డి, ప్రకాష్ యాదవ్, నర్సింహ, సాయి కుమార్, నీరజ్, స్థానికులు బస్తీ వాసులు మహిళలు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply